ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది.జిల్లాలోని పెద్దవాగు, ప్రాణిహిత తీరం వెంబటి ఆరు పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కళ్లంపల్లి – జాజుల పేట అటవీ ప్రాంతంలో మరో రెండు పులులు సంచరిస్తున్నాయని సమాచారం.ఇప్పటికే పలు ప్రాంతాల్లో పశువులపై దాడులకు పాల్పడ్డాయి.
పులుల సంచారంతో సుమారు 18 గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులుల పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు.
పెద్దపులులు సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







