సాయిబాబా ప్రత్యక్షమై అలా చెప్పారు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటి తులసి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో తులసి హీరోల తల్లి పాత్రల్లో నటిస్తూ అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటున్నారు.

 Actress Tulasi Sensational Comments Goes Viral In Social Media, Actress Tulasi ,-TeluguStop.com

తాజాగా తులసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తెలుగులో తులసి 700కు పైగా సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తులసి నటించారు.

ఒక సినిమా ప్రమోషన్ లో తులసి మాట్లాడుతూ దర్శకుడు శివమణితో వన్ డే మ్యాచ్ లా నా పెళ్లి అయిపోయిందని తులసి వెల్లడించారు.

బెంగళూరులో మా తాతగారు కట్టిన సాయిబాబా గుడిలో పెళ్లి జరిగిందని తులసి అన్నారు.నిజం చెప్పాలంటే నేను బీదవాడిని పెళ్లి చేసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయంలో మా అత్తగారు పాచి పనులు చేసేవారని తులసి చెప్పుకొచ్చారు.

నేను ఆ ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటికి ఆస్తి కలిసొచ్చిందని తులసి తెలిపారు.

అయితే ఆస్తి వచ్చినా మా ఆయన హీరోగా సినిమాలు చేయడం వల్ల అప్పులపాలు కావాల్సి వచ్చిందని తులసి వెల్లడించారు.నేను మిణుగు తార అనే మూవీ రాశానని ఆ సినిమా సక్సెస్ సాధిస్తే గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నారని అనుకున్న విధంగానే సినిమా సూపర్ హిట్ అయిందని తులసి అన్నారు.

Telugu Bangalore, Shivamani, Minugu Tara, Savitri, Sensational, Tollywood, Tulas

ఆ సినిమాకు 13 కోట్ల రూపాయల లాభం వచ్చిందని అయినా మొక్కు తీర్చకపోవడంతో వచ్చింది వచ్చినట్టు పోయిందని తులసి పేర్కొన్నారు.ఒకరోజు సాయిబాబా నా కలలోకి వచ్చి ఏడు జన్మలకు నువ్వే నా తల్లి అని చెప్పారని ఆరేళ్ల తర్వాత కడుపులో పుడతానని చెప్పారని తులసి చెప్పుకొచ్చారు.ఆరేళ్ల తర్వాత నాకు కొడుకు పుట్టగా సాయి అని పేరు పెట్టానని తులసి కామెంట్లు చేశారు.

హీరోయిన్ సావిత్రి అక్షయపాత్ర లాంటి వారు అని ఎవరేం అడిగినా ఆమె ఇచ్చేవారని చివరి రోజుల్లో సావిత్రి నరకం అనుభవించారని తులసి అన్నారు.

మా తాతగారు హీరోయిన్ గా ఫేడవుట్ అయిన తర్వాత నేను తల్లి పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారని ఆయన చెప్పిందే నిజమైందని తులసి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube