జగన్ లెక్క తప్పిందా ? ఏకమవుతున్న ప్రత్యర్ధులు

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత మహిళలు,  రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు విశేషమైన స్పందన వస్తూ ఉండడం, ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది.  అమరావతి వ్యవహారం మరింత ఉదృతం అవ్వడం తదితర కారణాలతో ఏపీ అధికార పార్టీ వైసిపి కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కుంటోంది.

 Pawan Kalyan Visit The Vishkapatnam Jagan, Ysrcp,ap, Tdp, Chandrababu, Ap Gove-TeluguStop.com

ముఖ్యంగా అమరావతి వ్యవహారం తమకు ఇబ్బందులు తీసుకొస్తుందనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నించింది.  విశాఖ గర్జన పేరుతో  భారీ సభని నిర్వహించింది.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు,  కీలక నాయకులు అంతా విశాఖ గర్జనలో టిడిపి,  జనసేన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    ఇక అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న పరిణామాలు,  పవన్ ను పోలీసులు అడ్డుకోవడం తదితర పరిణామాలు రాజకీయ రచ్చను రేపాయి.ఈ క్రమంలో టిడిపి , బిజెపిలు జనసేనకు సంఘీభావం ప్రకటించాయి.

ముఖ్యంగా బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు.అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.

ఇప్పటికే ఏపీలో టిడిపి,  జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.ఎన్నికల సమయంలో కచ్చితంగా పొత్తు ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం జనసేన, బీజేపీలు పొత్తు కొనసాగిస్తున్నాయి.
   

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Telugudesam, Ysrcp-Political

  అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే వైసీపీ కచ్చితంగా ఓటమి చెందుతుందని లెక్కలు అందరిలోనూ ఉన్నాయి.అయితే ఇదంతా ఎన్నికల సమయంలో , అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది.అయితే ఇప్పుడు విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ మూడు పార్టీలు మరింత దగ్గర అయ్యాయని, ఉమ్మడిగా వైసిపిని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇదంతా జరగడానికి వైసిపి నే ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.ప్రస్తుతం విశాఖలో పవన్ కు టిడిపి, బిజెపి అధ్యక్షులు సంఘీభావం తెలిపి, పవన్ తో మాట్లాడినా… అక్కడ పొత్తుల అంశం చర్చకు రాలేదు.

కానీ రాబోయే రోజుల్లో ఆ పొత్తుల బంధం బలపడేందుకు మాత్రం వైసీపీ నే ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.అమరావతి రాజధాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకు జనసేన అంశాన్ని హైలెట్ చేసేందుకు వైసిపి ప్రయత్నించినా…పొత్తులు ఏర్పడేందుకు మాత్రం పరోక్షంగా వైసిపి  మార్గం చూపించింది అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube