టాలీవుడ్ ఇన్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం సుధీర్ బాబు సినిమా లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నారు.
ఇకపోతే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం HUNT.ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్.పాపతో పైలం అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పై ప్రస్తుతం వివాదం నెలకొంది.హంట్ సినిమా తనదేనంటూ యంగ్ హీరో, దర్శకుడు నిక్షిత్ మీడియాకెక్కారు.
తానే ముందుగా ఫిలిం చాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశానని చెబుతున్నారు.
తన టైటిల్‌ను హుందాగా దొంగిలించారని ఆరోపించారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా శ్రీ క్రియేషన్స్ పతాకంపై, ఎంఎస్ ఆర్ట్స్ సహ నిర్మానంలో నిర్మాత నర్సింగ్‌రావు రూపొందిస్తోన్న చిత్రం హంట్.కాగా ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.
మేము హంట్ అనే టైటిల్‌ను ఆరు నెలల క్రితం ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నాం.

ప్రస్తుతం మల్లి అదే టైటిల్‌తో భవ్య క్రియేషన్స్ వాళ్లు సుధీర్ బాబు హీరోగా సినిమా చేస్తున్నారు.వాళ్లు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు.అయితే, ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ అయింది.
మేం రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను మీరెలా పెడతారు అని భవ్య క్రియేషన్స్ వాళ్లను అడిగాం.ఫిలిం చాంబర్‌లో కూడా మా సమస్యని తెలిపాం.చాంబర్ వాళ్లు కూడా భవ్య క్రియేషన్స్‌తో మాట్లాడారు.కానీ, మా సమస్యకు పరిష్కారం లభించలేదు.
మీడియా వాళ్లే పరిష్కారం చేయండి అంటూ మీడియా ముందు వాపోయారు.







