భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ నియామకం అయ్యారు.ఈ మేరకు నవంబర్ 9న చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ పదవీకాలం నవంబరు 8వ తేదీతో ముగియనుంది.
ఈ సందర్భంగా నూతన సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు.







