టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది.రూ.80.65 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది.రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నమోదైన కేసులో నామ ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది.ప్రాజెక్టు కింద బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.361.29 కోట్లు దారి మళ్లించినట్లు కేసు నమోదు చేసింది.







