సినీ తార నయనతార సరోగసి వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.దేశంలో సరోగసి బ్యాన్ అయిందన్న నేపథ్యంలో ఈ వ్యవహరంపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై తమిళనాడు ఆరోగ్య శాఖ విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.అయితే, నయనతార, విఘ్నేష్ శివన్ లకు ఆరేళ్ల క్రితమే పెళ్లి జరిగిందంటూ ఆధారాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే త్రిసభ్య కమిటీకి నయనతార దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లు సమాచారం.సరోగసి పద్ధతి చేపట్టాలంటే వివాహం జరిగి ఐదేళ్లు ఉండాలనే నిబంధన ఉంది.
నయనతార దంపతులు సమర్పించిన ఆధారాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.







