టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక అల్లు అర్జున్, తారక్, రామ్, నితిన్ మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.గత కొన్నేళ్లుగా హన్సిక తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.
చిన్న వయస్సులోనే హన్సిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా హన్సిక వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
అయితే వయస్సు పెరుగుతుండటం, సినిమా ఆఫర్లు తగ్గుతుండటంతో హన్సిక ప్రస్తుతం పెళ్లిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో హన్సిక పెళ్లి జరగనుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.సైలెంట్ గా పెళ్లి పనులు మొదలయ్యాయని త్వరలో హన్సిక అధికారికంగా పెళ్లి గురించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.50కు పైగా సినిమాలలో నటించిన హన్సికను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

ప్రస్తుతం తమిళ సినిమాలతో హన్సిక బిజీగా ఉన్నారు.ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలేస్ లో హన్సిక పెళ్లి జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ ప్యాలేస్ 450 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్యాలేస్ కావడం గమనార్హం.
హన్సిక వివాహం గ్రాండ్ గా జరగనుందని బోగట్టా.హన్సిక సినిమా రంగానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారా? లేక మరో రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.హన్సిక స్పందిస్తే మాత్రమే పెళ్లి తేదీ, ఇతర వివరాల గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.హన్సిక పెళ్లి వార్త అభిమానులకు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.
కొన్నేళ్ల క్రితం వరకు గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన హన్సిక ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రల్లోనే నటిస్తున్నారు.హన్సిక తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







