టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో నాగచైతన్య సమంత జంట ఒక్కటి.ఏ మాయ చేసావే సినిమా ద్వారా పరిచయమైన తర్వాత ప్రేమలో పడిన ఈ ఇద్దరు ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న నాగచైతన్య సమంత వివాహం తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇకపోతే వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ సమంత నాగచైతన్య విడిపోతున్నాం అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.
ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అయితే పెళ్లికి ముద్దు పెళ్లి తర్వాత సమంత కోసం నాగచైతన్య ఇచ్చిన కానుకలు అన్నిటిని కూడా సమంత తిరిగి ఇచ్చేసిందని నాగచైతన్య జ్ఞాపకాలు తన దగ్గర ఏవి లేకుండా చేసుకున్నారని తెలుస్తోంది.
ఇకపోతే సమంత పెళ్లి సమయంలో తాను ఉపయోగించిన నగలు అలాగే చీరలు కూడా దగ్గుబాటి రామానాయుడు గారి సతీమణివని తెలిపారు.ఇలా నాగచైతన్య తన అమ్మమ్మ చీరనే సమంత తన పెళ్లిలో కట్టుకుందనే విషయం తెలిసిందే.

ఇకపోతే వీరి విడాకులు తర్వాత సమంత పెళ్లిలో వేసుకున్నటువంటి నగలు చీరలు అన్నింటిని కూడా దగ్గుబాటు వారి ఫ్యామిలీకి ఇచ్చేశారని వార్తలు వచ్చాయి.అయితే సమంత మెడలో నాగచైతన్య కట్టిన తాళి గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.ఇలా సమంత మెడలో నాగచైతన్య కట్టిన తాళి దగ్గుబాటి లక్ష్మి గారి అమ్మ వాళ్లు ఇచ్చారట.ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత ఇద్దరు విడిపోయిన తర్వాత నాగచైతన్య కట్టిన తాళిని కూడా సమంత దగ్గుబాటి కుటుంబానికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇలా నాగచైతన్య వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ ఒక్క వస్తువును కూడా సమంత తన వద్ద పెట్టుకోలేదని సమాచారం.







