సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్నప్పటికీ హీరోలు చేసే సినిమాలు మధ్య మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉంటుందని చెప్పాలి.ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోలు సినిమాల విషయంలో భారీ స్థాయిలో పోటీపడుతూ నెంబర్ వన్ స్థానంలో నిలబడటానికి ఆరాటపడుతుంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అంటే అందరూ చిరంజీవి పేరు చెప్పేవారు అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన హీరోల హవా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కూడా కొనసాగుతుందని చెప్పాలి.
ఈ క్రమంలోని ఏ హీరోకి ఎక్కువ ఆదరణ ఉంది, ఎవరు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు అనే విషయంపై ఓర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల అత్యంత ఆదరణ పొందిన హీరోల జాబితాలను విడుదల చేస్తుంటారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో అత్యంత ఆదరణ పొందిన టాలీవుడ్ హీరోల జాబితాను విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ మీడియా సర్వే ప్రకారం సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందిన హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ అనంతరం ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచిన ఈయన మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా ఎన్టీఆర్ రెండవ స్థానంలోనూ, అల్లు అర్జున్ మూడవ స్థానం రామ్ చరణ్ నాలుగవ స్థానం మహేష్ బాబు ఐదవ స్థానంలో చోటు సంపాదించుకున్నారు.







