దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా గరికపాటి చిరంజీవి మధ్య జరిగిన సంఘటన ఎలాంటి వివాదాలకు దారితీసిందో మనకు తెలిసిందే.ఈ ఘటన జరిగి సుమారు పది రోజులు కావస్తున్న ఇప్పటికే ఇంకా ఈ వివాదం గురించి పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
అయితే ఈ విషయంపై ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గరికపాటి పై తనదైన శైలిలో విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఓ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ శ్రీరాముడు సీతాదేవి కథ చెబుతూ గరిక గురించి మాట్లాడారు.
సీతాదేవి కాకిని పారద్రోలటానికి ఆ గడ్డి పరక బ్రహ్మాస్త్రంగా మారుతుందని అంత మూలాన ఆ గరిక తానే బ్రహ్మాస్త్రం అనుకుంటే తప్పు దానిని బ్రహ్మాస్త్రంగా మార్చిన రాముడి గొప్పదనం అంటూ ఈయన పరోక్షంగా గరికపాటి పై కామెంట్లు చేశారు.
ఈ విధంగా అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై గరికపాటి నరసింహారావు స్పందిస్తూ అనంత శ్రీరామ్ కి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గరికపాటి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీతాదేవి కథ చెప్పారు.సీతాదేవి అశోక వనంలో గరికపోచును అడ్డుపెట్టుకొని రావణాసురుడితో మాట్లాడినట్లు గరికతో మాట్లాడారు.ఆ సమయంలో సీతాదేవికి మాట్లాడటానికి గరిక లేకపోతే, ఈ గరికపాటి లేకపోతే ఎవరితో మాట్లాడి ఉండేది అంటూ ఈయన పరోక్షంగా అనంత శ్రీరామ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ విధంగా అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై గరికపాటి చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యల గురించి పలువురు చర్చలు మొదలుపెట్టారు.గరికపాటి నరసింహారావు పరోక్షంగా ఇలా గరిక గురించి కథ చెప్పడంతో ఈయన రైటర్ అనంత శ్రీరామ్ నీ ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు.ఏది ఏమైనా గరికపాటి క్షమాపణలు చెప్పినప్పటికీ మెగాస్టార్ అభిమానులు ఇంకా ఈ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.







