తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమావేశం ముగిసింది.ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
అదేవిధంగా పార్టీలో చేరికలపై దృష్టి సారించామని టీడీపీ అధికార ప్రతినిధి తెలిపారు.దీనిలో భాగంగానే ఇకపై ప్రతివారం పార్టీలో చేరికలు ఉంటాయని వెల్లడించారు.
పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారన్న ఆమె.రాష్ట్రంలో పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లోపే తెలంగాణలో టీడీపీ ఒక శక్తివంతమైన పార్టీగా ఎదుగుతామని పేర్కొన్నారు.