భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వీరిద్దరూ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, వచ్చే ఏడాది భారతదేశానికి జీ 20 ప్రెసిడెన్సీ గురించి చర్చించారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి , ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు వాషింగ్టన్‌కు చేరుకున్నారు నిర్మలా సీతారామన్.ఈ సందర్భంగా ఆమె పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం భారత సంతతికి చెందిన ఆర్ధిక వేత్త, ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆహారం, ఇంధన భద్రత సమస్యలు, ప్రపంచ రుణాలు, వాతావరణ సమస్యలు, డిజిటల్ ఆస్తులు తదితర అంశాల గురించి వీరిద్దరూ చర్చించారు.
దీనికి సంబంధించిన వివరాలను గీతా గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.కాగా.
భారతదేశం డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు ఒక ఏడాది పాటు జీ20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది.
ఇకపోతే.
భారత్‌లో పుట్టి పెరిగిన గీతా గోపీనాథ్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.కోల్‌కతాలో పుట్టిన ఈమె కర్ణాటకలోని మైసూరులో పెరిగారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ … ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు.అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.2005లో ప్రతిష్టాత్మక హార్వర్డ్‌కు వెళ్లారు.

గీతా గోపీనాథ్ 2016లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు.అయితే ఈ నియామకం వివాదాస్పదమైంది.కాగా గీతా గోపీనాథ్.ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు.ఆర్ధిక శాస్త్రానికి అసమాన సేవలు చేసిన గీతా గోపీనాథ్ ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు.2014లో ఐఎంఎఫ్ గుర్తించిన 45 అగ్రశ్రేణీ ఆర్థికవేత్తల్లో గీతా 25వ ర్యాంక్ పొందారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2011లో గీతను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది.







