అన్ స్టాపబుల్ సీజన్2 ఆహా ఓటీటీలో ప్రసారమవుతుండగా చంద్రబాబు, లోకేశ్ గెస్ట్ లుగా హాజరైన ఫస్ట్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.అయితే ఈ షోలో చంద్రబాబు, బాలకృష్ణల మధ్య అనేక వివాదాస్పద అంశాల గురించి జోరుగా చర్చ జరిగింది.
బాలయ్య ఈ షోలో చంద్రబాబు నాయుడును ప్రశంసిస్తూనే అదే సమయంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు.
అయితే చంద్రబాబు, బాలయ్య చెప్పిన విషయాల గురించి లక్ష్మీ పార్వతి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు, బాలకృష్ణ చెప్పిన విషయాలలో ఏ మాత్రం నిజం లేదని ఆమె అన్నారు.చంద్రబాబు, బాలకృష్ణ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కొరకు ఈ షోను ఎంచుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నానని చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని లక్ష్మీపార్వతి అన్నారు.
ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది చంద్రబాబేనని పార్టీలో గొడవలు చేయించింది చంద్రబాబే అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ షో చూసిన తర్వాత బాలయ్య అంటే అసహ్యం వేస్తోందని ఆమె కామెంట్లు చేశారు. బాలకృష్ణ అసలు సీనియర్ ఎన్టీఆర్ కొడుకేనా అన్నంత అసహ్యం వేస్తోందని ఆమె కామెంట్లు చేశారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్లు షోలో ఒకరినొకరు సమర్థించుకున్నారని ఆమె అన్నారు.
వాస్తవాలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ సీజన్2 కు వచ్చారని ఆమె అన్నారు.లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ల విషయంలో టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.తనకు వ్యతిరేకంగా బాలయ్య, చంద్రబాబు కామెంట్లు చేయడంతో లక్ష్మీపార్వతి ఈ విధంగా రియాక్ట్ అయ్యారని మరి కొందరు చెబుతున్నారు.
లక్ష్మీపార్వతి చెప్పిన విషయాలన్నీ నిజమేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.