అగ్ర రాజ్యం అమెరికాలో మరో సారి తూటా పేలింది.అమెరికాను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలలో గన్ కల్చర్ కూడా ఒకటి.
ఎంత పెద్ద కండలు తిరిగిన మొనగాడు అధ్యక్షుడిగా వచ్చినా సరే తుపాకి నియంత్రణపై మాత్రం తన మార్క్ లో నియంత్రణ తీసుకురాలేక పోతున్నాడు.అంతేకాదు నియంత్రణ చట్టాలని రూపొందించినా సరే అవి బిల్లు రూపంలో బయటకు రాలేకపోతున్నాయి.
దాంతో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.
కొన్ని నెలల క్రితం అమెరికాలో ఓ స్కూల్ లో సుమారు 19 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనతో యావత్ అమెరికా షాక్ అయ్యిపోయింది.
ఈ ఘటన తరువాత బిడెన్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. గన్ కల్చర్ పై నిభందనలు విడుదల చేస్తూ నియంత్రణ కోసం చట్టలాని తీసుకువచ్చారు.అయితే ఇప్పటికి అవి అమలుకు నోచుకోక పోవడం గమనార్హం.ఇదిలాఉంటే తాజాగా అమెరికాలో మరో సారి తూటా పేలింది.
ఈ ఘటనలో సుమారు 5 మంది చనిపోగా అందులో ఒక పోలీస్ అధికారి సైతం ఉండటం సంచలనం సృష్టించింది.కాగా ఈ ఘటనకు కారకుడైన దుండగుడిని వెతికి పట్టుకున్న పోలీసులు అతడిని చూసి షాక్ కి గురయ్యారట.వివరాలలోక్ వెళ్తే
అమెరికాలోని నార్త్ కరోలినా లోని న్యూస్ రివర్ గ్రీన్ వే సమీపంలో రద్దీగా ఉంది.అటుగా నడిచి వెళ్తున్న వారిపై ఓ బాలుడు (15 ) తన వద్దనున్న తుపాకి తీసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.దాంతో షాక్ కి లోనయిన ప్రజలు పరుగులు పెట్టారు.బాలుడిని నిలువరించడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారిపై కూడా బాలుడు కాల్పులు జరపడంతో అధికారి అక్కడికక్కడే మృతి చెందారు.
కాల్పుల అనంతరం పారిపోయిన బాలుడిని 24 గంటలు గడవక ముందే ఆ ప్రాంతం అంతా పోలీసులతో జల్లెడ పట్టి అతడిని పట్టుకున్నారు.తీరా చూస్తే దుండగుడు 15 ఏళ్ళ బాలుడు అవడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.
ఈ ఘటనపై ఎప్పటిలానే తుపాకి నియంత్రణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.