డైరెక్టర్ సంతోష్ కుంభంపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.ఈ సినిమాలో విశ్వంత్, మాళవిక సతీశన్, పూజా రామచంద్రన్, హర్షవర్ధన్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాలో కే నిరంజన్ రెడ్డి, వేణు మాధవ్ పెద్ది నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు.
బాల సరస్వతి సినిమాటోగ్రఫీ అందించారు.విజయ్ వర్ధన్ కే ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.హీరో విశ్వంత్ కు కూడా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
ఇందులో విశ్వంత్ అర్జున్ పాత్రలో కనిపిస్తాడు.అయితే అర్జున్ ఒక బాయ్ ఫ్రెండ్ ల అద్దెకు వెళ్తూ ఉంటాడు.
దాంతో అందరూ అమ్మాయిలు కూడా అతనిని చూసి బాయ్ ఫ్రెండ్ లా బుక్ చేసుకుంటూ ఉంటారు.దీంతో నటాషా (పూజా రామచంద్రన్) అనే అమ్మాయి కూడా అర్జున్ ని బుక్ చేసుకుంటుంది.
ఇక అతడిని ఒకరోజు నైట్ బాయ్ ఫ్రెండ్ లా తీసుకుంటుంది.దీంతో నటాషా ఆరోజు రాత్రి అతడిని శారీరకంగా కలిసే ప్రయత్నం చేయడంతో దానికి నో చెప్తాడు అర్జున్.
దీంతో అర్జున్ ఆమెకి ఎందుకు నో చెప్తాడు.ఇక అతడు అందరికీ బాయ్ ఫ్రెండ్ లా ఎందుకు వెళ్తుంటాడు.
అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
హీరో విశ్వంత్ నటన బాగా ఆకట్టుకుంది.అతని లుక్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.నటి మాళవిక కూడా నటలతో బాగానే ఆకట్టుకుంది.
ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బాగా మెప్పించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:
టెక్నికల్ పరంగా చూసినట్లయితే డైరెక్టర్ వర్క్ పరవాలేదు అన్నట్లుగా ఉంది.కథలో కొత్తదనం లేకపోయినా కూడా కొంతవరకు ఆకట్టుకునే విధంగా ఉంది.ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి.గోపి అందించిన సంగీతం ఆకట్టుకుంది.బాల సరస్వతి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.ఎడిటింగ్‌లో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

విశ్లేషణ:
ఇక ఈ సినిమాలో అంతగా కొత్తదనం కనిపించలేదు.కాస్త కథలో కూడా క్లారిటీ లేకుండా ఉంది.కానీ కొంతవరకు యువతను ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ను అనుకున్న విధంగా తీయలేదు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, సంగీతం పర్వాలేదు.డైలాగ్స్.హీరో డీసెంట్ లుక్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్: ఎడిటింగ్‌లో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది.కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.కొన్ని సన్నివేశాలలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.ఇక హీరో పాత్రలో క్లారిటీ లేనట్లుగా అనిపించింది.
బాటమ్ లైన్:
చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాలో నటీనటుల నటనతో పాటు కొన్ని అంశాలు ఆకట్టుకున్నాయి.కొంతవరకు ఈ సినిమా చూడటానికి బెటర్ గానే ఉంది అని చెప్పవచ్చు.