మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ నిమిషాల్లోనే తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉంటారని బోగట్టా.
సినిమాలోని ఒక విలన్ రోల్ లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కనిపించనున్నారని బోగట్టా.కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది.ఈ సినిమా షూటింగ్ కు చాలా సమయం ఉన్న నేపథ్యంలో జక్కన్న ఇప్పటినుంచే నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.మహేష్ హీరోగా కార్తీ విలన్ గా నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
కార్తీ కూడా ఈ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు బోగట్టా.
రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దక్కినా ఆ పాత్ర వల్ల వచ్చే మంచి పేరు అంతాఇంతా కాదు.రాజమౌళి డిజైన్ చేసిన పాత్ర కొత్తగా ఉండటంతో కార్తీ ఈ సినిమాలో నటించడానికి వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.
ఈ సినిమాలో మరో విలన్ ను మాత్రం ఫైనల్ చేయాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
అటు మహేష్ బాబు కెరీర్ లో ఇటు రాజమౌళి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.రాజమౌళి ఈ సినిమాను విదేశాల్లో షూట్ చేయనున్నారు.
ఇప్పటివరకు ఎవరూ షూట్ చేయని లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.