ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా… ఈలోపునే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని పదే పదే టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెబుతూ, వారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, సాధారణ ఎన్నికలే జరుగుతాయని ప్రభుత్వ సలహాదారు వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అయినా చంద్రబాబు మాత్రం ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రకమైన హడావిడి వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ చేస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ ఎక్కడా చెప్పడం లేదు.కానీ 2024 ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులను , ఎమ్మెల్యేలను, కీలక నాయకులను యాక్టివ్ చేసే పనిలో జగన్ నిమగ్నం అయ్యారు.
అందుకే ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అలాగే నియోజకవర్గానికి ఒక 50 మంది చొప్పున కీలక నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
ఈ సందర్భంగా జగన్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఆలూరు నియోజకవర్గం వైసీపీ కీలక నాయకులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చిన మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పిన జగన్ ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలని, గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి సమన్వయంతో అంతా కలిసికట్టుగా పనిచేస్తే .పార్టీ 2024 ఎన్నికల్లో మళ్ళీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ఎమ్మెల్యేలను కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు జగన్ చెప్పుకొచ్చారు.

అలాగే ప్రతి సచివాలయానికి 20 లక్షలు అందించబోతున్నామని, ఆ సచివాలయ పరిధిలో ఏ అవసరాలకు ఆ సొమ్ములు అవసరమైతే వాటిని ఉపయోగించుకునేలా అవకాశం కల్పించబోతున్నట్లు జగన్ చెప్పారు.ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో … ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో రెండు రోజులపాటు పర్యటిస్తానని జగన్ ఈ సందర్భంగా తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గ పైన జగన్ ఇదేవిధంగా ఫోకస్ పెట్టారు .నియోజకవర్గంలోని 50 మంది కీలక నాయకులతో సమావేశం కావడం ద్వారా , ఆ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు .వారి ఫీడ్ బ్యాక్ ద్వారా తగిన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, ఎన్నికల నాటికి ఎక్కడా ఎటువంటి లోటు పాట్లు లేకుండా చేయగలుగుతాము అనే విషయాన్ని జగన్ బాగా నమ్ముతున్నారు.అందుకే ఈ విధంగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు.







