మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా పండుగ కానుకగా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరు తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో ముచ్చటించారు.ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరంజీవి.
అయితే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నట్లు పూరి జగన్నాథ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చిరంజీవితో పూరి జగన్నాథ్ గతంలో చేయాలి అనుకున్న ఆటో జానీ సినిమా గురించి చర్చించారు.ఆటో జానీ స్క్రిప్ట్ ఉందా పక్కన పెట్టావా అని చిరంజీవి ప్రశ్నించగా.

లేదండి ఆటో జానీ ని పక్కన పడేసాను అంతకు మించిన కథను రెడీ చేశానని పూరి జగన్నాథ్ తెలిపారు.అలాగే పూరి, చిరంజీవి ని పాలిటిక్స్ గురించి కూడా అడగగా ఆ విషయం గురించి ఎంతో ఓపికగా స్పందించారు చిరంజీవి.చిరంజీవి పూరి జగన్నాథ్ ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించుకోవడంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.ఇకపోతే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, నటుడు సత్య నటించిన విజయం తెలిసిందే.







