ఈ మధ్యకాలం చాలా మందికి ఆరోగ్యం పై శ్రద్ధ బాగా పెరిగింది.అలా పెరగడం వల్ల చాలా మంది ప్రతిరోజూ ఉదయం గ్రౌండ్ కి వెళ్లి వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటారు.
వ్యాయామం చేసేందుకు చాలా మంది జిమ్‌కి కూడా వెళ్తుంటారు.అక్కడ ఉండే పరికరాలను ఒకరి తర్వాత ఒకరు ఉపయోగిస్తుంటారు.
ఇద్దరు ఒకేసారి కావాలనుకుంటే ఎవరైనా ఒకరు వేచి ఉండాల్సి వస్తుంది.
ఈ క్రమంలో ఎవరైనా కచ్చితంగా నేనే చేయాలి అని కోప్పడితే అది గొడవకు దారితీస్తుంది.
అలాంటి సంఘటనే ఒకటి ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది.ఇద్దరు మహిళలు జిమ్ లో వెయిట్ లిఫ్ట్ పరికరం కోసం జుట్టు పట్టుకుని పోట్లాడారు.
ఇలా గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
జిమ్ లో ఓ మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా మరో మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కోసం ఎదురు చూస్తోంది.
ముందు వెయిట్ లిఫ్టింగ్ చేసిన మహిళ అక్కడి నుంచి వెళ్లగానే తాను ఆ వర్కౌట్ చేసేందుకు వెళ్లింది.ఈ క్రమంలోనే మరో మహిళ వెనకాల నుంచి వచ్చి ఆమెను తోసేసి వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయబోయింది.
ఈ క్రమంలో ఇద్దరూ ఒక్కసారిగా గొడవ పడడం మొదలుపెట్టారు.
నువ్వెంతంటే నువ్వెంత అంటూ జుట్టు పట్టుకుని పోటీపడుతూ ఒకరిపై ఒకరు యుద్ధం చేసేలా కొట్టుకున్నారు.
వారిని చూసి అక్కడే ఉన్న ఓ యువతి భయంతో బయటకు పరుగులు తీసింది.మరో మహిళ వచ్చి వారి గొడవను ఆపేందుకు ప్రయత్నించింది.
ఈ సంఘటనను చూసి నేటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఈ గొడవ వల్ల చాలా కేలరీలు కరిగిపోతాయని కొందరు కామెంట్లు చేయగా, దృఢమైన జుట్టు కోసం ఇదొక మంచి వర్గం కానీ ఫన్నీగా కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఢిల్లీలో ని జిమ్‌లో మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను పొడిచి చంపిన సంఘటన ఈ ఏడాది మార్చిలో జరిగింది.







