వైరల్: ఒకే బాత్ రూంలో రెండు కమోడ్ లు ఎందుకు పెట్టారక్కడ?

సాధారణంగా ఒక బాత్ రూములో ఒక్కటే కమోడ్ ఎక్కడైనా ఉంటుంది.అలాగే నిర్మాణం జరుగుతుంది.

 Viral: Why Are There Two Commodes In The Same Bathroom Bath Room, Camodo,2 Viral-TeluguStop.com

అయితే కొన్ని చోట్ల దానికి విరుద్ధమైన నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి.అలాంటివి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలలో ఎక్కువగా కనబడతాయి.

ఎందుకంటే అక్కడ సో కాల్డ్ అధికారులకి నిబద్ధత ఉండదు.ఏదో తూతూ మంత్రంగా పనికానిచ్చేస్తారు తప్పితే చేసే పనిలో నాణ్యతను చూడరు.

కేవలం పని పూర్తి కావాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళతారు.ఒకవేళ అందులో ఏవైనా లోపాలున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

దీంతో ఆ పధకాలు ప్రజలను వరాలుగా మారడానికి బదులు శాపాలుగా మారుతాయి.నేడు సోషల్ మీడియా వినియోగం బాగా ప్రబలడంతో ఇలాంటి లోటుపాట్లు ఉంటే వాటిపై విమర్శలు కూడా అదే రీతిలో వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జరిగిన ఓ సంఘటనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ చూస్తే అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇల్లు అన్నాక బాత్ రూం ఉండటం సహజమే.కానీ అది విచిత్రంగా ఉండటమే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది.

Telugu Latest, Bath, Camodo, Tamil Nadu-Latest News - Telugu

అవును, అక్కడ పరిశ్రమలకు సంబంధించిన ఓ ప్రాజెక్టు కార్యాలయం తాజాగా నిర్మించారు.తొందరలో ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా పనులు పూర్తి చేసేసారు.మరి వారికి కమోడ్ లు ఎక్కువైనాయని అనుకున్నారేమో బాత్ రూములో ఒక కమోడ్ ఏర్పాటు చేయడానికి బదులు రెండు కమోడ్ లు ఏర్పాటు చేసారు.ఇక వాటి మధ్య గోడ కూడా లేకపోవడం కొసమెరుపు.

అలాగని వాటికి వేరువేరు తలుపులు కూడా లేవు.ఒకే గదిలో రెండు కమోడ్ లు ఏర్పాటు చేయడంతో వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

దీంతో అందరు విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube