దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది.ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మరొకరిని ప్రశ్నిస్తున్నారు.
ఇందులో ఏ9 నిందితుడిగా ఉన్న ఢిల్లీ వ్యాపారవేత్తఅమిత్ అరోరాను విచారిస్తున్నారు.బుడ్డి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎండీగా ఉన్నారు అమిత్ అరోరా.
ఇటీవల అరెస్ట్ అయిన అభిషేక్ రావు ఇచ్చిన సమాచారంతో అమిత్ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు.వీరి మధ్య హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు.
కాగా ఈ కుంభకోణం కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.







