అనంతపురం జిల్లాలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం రేపాయి.జిల్లాలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నాయక్ అనే వ్యక్తి మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆయన ఇంటిని కాజేశారు.
అసలు విషయాన్ని తెలుసుకున్న బాధితుడు శ్రీరామ్‌నాయక్ పోలీసులను ఆశ్రయించారు.ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.