ఉత్తరాంధ్ర గర్జన ఎందుకో వైసీపీ చెప్పాలని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.
స్టీల్ ప్లాంట్, గన్నవరం పోర్ట్, పోలవరంపై ఎందుకు గర్జించలేదని నిలదీశారు.విశాఖకు ఒక ప్రాజెక్ట్ అయిన తీసుకోచ్చారా అని ప్రశ్నించారు.
రైల్వే జోన్ పై రాజీనామా చేస్తానన్న విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదన్నారు.దోచుకోవడానికే ఏ-2 విజయసాయిరెడ్డి విశాఖకు వచ్చారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద బినామీల ద్వారా లక్ష గజాల స్థలం కొన్నారని తెలిపారు.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారన్న అయ్యన్నపాత్రుడు.
రేపో మాపో కేజీహెచ్ పేరును కూడా భారతి కేజీహెచ్ గా మారుస్తారేమో అని ఎద్దేవా చేశారు.సరైన అవగాహన లేకుండా జగన్ పాలన చేస్తున్నారని విమర్శించారు.







