తెలుగులో ఇటీవలె 21 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం కేవలం 16 మంది కనిపిస్టెంట్లు మాత్రమే.అయితే చూస్తుండగానే బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఐదో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఊహించని విధంగా చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యాడు.అయితే చలాకీ చంటి 5వ వారం తప్పకుండా ఎలిమినేట్ అవుతాడు అని బిగ్ బాస్ ప్రేమికులు ముందుగానే అంచనా వేశారు.
అనుకున్న విధంగానే ఐదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకి చంటి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.ఎలిమినేట్ అయిన చంటి బిగ్ బాస్ కేఫ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
బిగ్ బాస్ షో ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు చలాకి చంటి.అంతేకాకుండా యాంకర్ శివ పై కూడా మండిపడ్డాడు.
ఇకపోతే చంటి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే వారానికి 50వేల రూపాయలు చొప్పున 5 వారాలకు గాను రెండు లక్షల 50 వేల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది.ఇంటర్వ్యూలో భాగంగా చంటి మాట్లాడుతూ.

కొందరు ప్రేక్షకులు హౌస్ లో చంటి కనిపించడం లేదు అంటున్నారు శివ అనగా ఏ ప్రేక్షకులు అన్నారో వారిని పిలుచుకొని వచ్చి సమావేశం ఏర్పాటు చేయ అంటూ కాస్త కోపంగా స్పందించాడు చంటి.అంతేకాకుండా హౌస్ లో ఉన్న ప్రతివాడు వాన్ని వాడు కాపాడుకోవడానికి ఎవరినీ అయినా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడని చంటి తెలిపాడు.అప్పుడు శివ దీనికి అంటే మీ తప్పేం లేదు బిగ్ బాస్ తప్పు, గేమ్ ఆపడం అని శివ అంటే, ఎస్.ఎలా అయిన అనుకో.ప్లాబ్లమ్ లేదు అని తెలిపాడు చంటి.నాకు ఇప్పటిదాకా అర్థమైంది బిగ్ బాస్ హౌజ్ లో ఆటంటే బీయింగ్ ఫేక్.యాంకర్ శివ ని కూడా నువ్వు కూడా ఫేక్ గానే ఆడావ్ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు చంటి.







