టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఒక కీలకపాత్రలో నటించింది.ఈ సినిమాలో సునీల్ భార్యగా నటించింది దివి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించిన సందర్భంగా ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న బిగ్ బాస్ బ్యూటీ దివి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.బిగ్ బాస్ షోతో అందరికీ పరిచయం అయినా నేను ఆ షోలో అడుగు పెట్టడానికి కంటే ముందు దాదాపుగా వందకు పైగా ఆడిషన్స్ లో పాల్గొన్నాను.
ఎంతోమంది నన్ను రిజెక్ట్ చేశారు వాటి వల్ల నేను మరింత ధైర్యంగా మారి ఆ తర్వాత రియాల్టీ షోలోకి అడుగు పెట్టాను అని చెప్పుకొచ్చింది దివి.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే సినిమాలో నాకు అవకాశం ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారమే ఘాట్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారు.చిరంజీవి గారి సినిమాలో నటించిన చాలా అద్భుతంగా అనిపించింది.

అందులో ఉన్న రోల్ చూసి ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటున్నారు అంటే ఆ పాత్రకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను అని తెలిపింది దివి.చిరంజీవి గారు అందరినీ ఒకే విధంగా చూస్తారు.చిరంజీవి గారితో ఫోటో దిగాలని ఊటీ షెడ్యూల్ కి నాతో పాటు మా అమ్మ నాన్న కూడా వచ్చారు.వాళ్లు ప్రతి రోజు సెట్ కు వచ్చే వాళ్ళు ఆ విషయాన్ని నేను చిరంజీవి గారితో కూడా చెప్పాను.
రోజు మా అమ్మ నాన్న సెట్లో ఉండటానికి గమనించిన ఆయన వెంటనే కారు దిగివచ్చి మా అమ్మ నాన్నతో కలిసి ఒక ఫోటోని దిగారు.ఆ సన్నివేశాన్ని ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చింది దివి.







