తక్కువ చేసి మాట్లాడొద్దు.. గీతూ రాయల్ పై బాలాదిత్య కోపానికి కారణం ఇదే!

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న బాలాదిత్యా గురించి మనందరికీ తెలిసిందే.బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎవరితోనూ కొట్లాటలకు వాదనలకు దిగకుండా, తన పని తాను చేసుకుంటూ ఇచ్చిన టాస్కులు అలాగే గేములలో సత్తాను చాటుతూ సైలెంట్ గా ఉంటూ తెలివిగా గేమ్ ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు దీంతో బిగ్ బాస్ ప్రేమికులు బాలాదిత్యకు రేలంగి మామయ్య అనే పేరును కూడా పెట్టేశారు.

 Baladitya Fire On Geethu In Bigg Boss Season 6, Baladithya, Geethu Rayal, Bigg B-TeluguStop.com

అయితే ఎప్పుడు కూల్ గా ఉండే రేలంగి మామయ్యకి మండేలా చేసింది గలాటా గీతూ.

ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గీత బాలాదిత్య మధ్య పెద్ద గొడవే జరిగినట్టు కనిపిస్తోంది.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.అయితే అందులో గీతూ,బాలాదిత్యా ను ఏం అనిందో తెలియదు కానీ ఆమె మీదకు దూసుకెళ్లిన బాలాదిత్య.

నా చదువుని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటూ పెద్దగా అరిచాడు.అప్పుడు గీతూ మాట్లాడబోతుండగా.తప్పు.తప్ప అది.నీకు అర్థం కాకపోతే హేళన చేస్తావా అని వేలు చూపిస్తూ గీతూ కి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు బాలాదిత్య.

నిన్ను తక్కువ చేయలేదన్నా అంటూ గీతూ గట్టిగా మాట్లాడటంతో వెంటనే బాలాదిత్యా.గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు ఆపు.వింటున్నా.అన్నీ వింటున్నా.ఆట పట్టించడానికి అయినా లిమిట్‌ ఉంటుంది.అది దాటితే ఇలాగే ఉంటుంది అంటూ సీరియస్‌ గా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బాలాదిత్యా.ఎప్పుడూ కూల్‌గా ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేంటో చూసుకుంటూ ఆట ఆడుకునే బాలాదిత్య తనలోని మరో యాంగిల్‌ను పరిచయం చేసేలా చేసింది గీతూ.

ఇకపోతే నేడు బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఎలిమినేషన్స్ జరగనున్నాయి.మరి ఈ ఐదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube