తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు.దాదాపు వీరిద్దరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత రాజకీయాలపై వీరిద్దరు చర్చించుకున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది.మరోవైపు చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” విజయం సాధించటంతో చిరంజీవికి అభినందనలు తెలియజేయడానికి గంట శ్రీనివాసరావు సమావేశమైనట్లు గంటా సన్నిహితులు చెబుతున్నారు.
ఏది ఏమైనా చాలాకాలం తర్వాత చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంట భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో గంటా శ్రీనివాసరావు కీలకంగా రాణించారు.
చిరంజీవి కుటుంబంతో మంచి సానిహిత్య సంబంధం ఉంది.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గంట తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం 2014 ఎన్నికలలో గెలిచి మంత్రి కావటం జరిగింది.2019 ఎన్నికల్లో గెలిచిన గాని వైసీపీ గెలవడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంట శ్రీనివాసరావు కొనసాగుతూ ఉన్నారు.ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న గంట శ్రీనివాసరావు.
చిరంజీవితో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.







