అమెరికా యూనివర్సిటీ క్యాంపస్‌లో భారతీయ విద్యార్ధి హత్య.. రంగంలోకి విదేశాంగ శాఖ

అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారత సంతతికి చెందిన విద్యార్ధి దారుణహత్యకు గురైన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.ఇరుదేశాల్లోనూ తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది.

 Mea Focused On Murder Of Indian-origin Student In Us' Indiana , Mea , Indian-ori-TeluguStop.com

హత్యకు దారి తీసిన పరిస్ధితులపై స్థానిక అధికారులతో టచ్‌లో వున్నట్లు శుక్రవారం తెలిపింది.భారత విద్యార్ధి హత్య దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విచారం వ్యక్తం చేశారు.

ఈ కేసు పరిణామాలపై తాము ఓ కన్నేసి వుంచుతున్నట్లు ఆయన తెలిపారు.

మృతుడిని 20 ఏళ్ల వరుణ్ మనీష్ చద్దాగా గుర్తించారు.

ఇతను పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.హాస్టల్‌లో తోటి రూమ్‌మేట్ చేతిలో వరుణ్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అనుమానితుడిని దక్షిణ కొరియోలోని సియోల్‌కు చెందిన 22 ఏళ్ల జీ మిన్ షాగా గుర్తించినట్లు పర్డ్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైటే తెలిపారు.వరుణ్‌ శరీరంపై కత్తి పోట్లు కనిపించాయని.

వాటి వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది.అనుమానితుడిపై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీస్ చీఫ్ తెలిపారు.

యూనివర్సిటీ క్యాంపస్‌కు పశ్చిమ భాగాన వున్న మెక్‌కట్చియాన్ హాల్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12.44 గంటలకు పర్డ్యూ యూనివర్సిటీ పోలీస్ విభాగానికి 911 కాల్ వచ్చిందని వర్సిటీ ప్రతినిధి మీడియాకు తెలిపారు.ఆ సమయంలో ఆ గదిలో షా, వరుణ్‌లు మాత్రమే వున్నారు.జీమిన్ షానే స్వయంగా ఈ కాల్ చేశాడని ఆయన చెప్పారు.ఈ ఘటనపై పర్డ్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ డేనియల్స్ మాట్లాడుతూ.పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు.

గణాంకాల ప్రకారం.పర్డ్యూ యూనివర్సిటీలో జనవరి 2014 తర్వాత క్యాంపస్‌లో జరిగిన తొలి హత్య ఇదే.వరుణ్ మరో 10 రోజుల్లో తన 21వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది.2020లో పార్క్ ట్యూడర్ హైస్కూల్ నుంచి ఇతను గ్రాడ్యుయేషన్ చేశాడు.అదే ఏడాది నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో సెమీఫైనలిస్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube