ఉపవాసం వున్నవారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన CEO.. అలా చేస్తే రూ.10 లక్షల రివార్డు!

అవును, మీరు విన్నది నిజమే.కానీ ఈ అవకాశం అందరికీ కాదు సుమా.

 The Ceo Announced A Bumper Offer For Those Who Are Fasting-TeluguStop.com

కేవలం ఆ కంపెనీ ఉద్యోగులకు మాత్రమే.ఇంతకీ ఏ కంపెనీ.

CEO ఎవరు? దాని కధేమిటి? అని తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ఆన్‌లైన్‌ బ్రోకింగ్ కంపెనీ అయినటువంటి జెరోదా CEO నితిన్‌ కామత్‌ తన ఉద్యోగులకు ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు.

అదేమంటే, ఫిట్‌నెస్ ట్రాకర్స్ మీద డైలీ యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేసుకొని, వాటిని సాధించిన వారికి ఒక నెలబోనస్ జీతం అందిస్తామని తాజాగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ… ప్రతి మనిషి క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటిస్తూ జీవనం సాగించినపుడే యాక్టివ్ గా ఉండి, ముందుకెళ్తారని చెప్పుకొచ్చారు.

ఇకపోతే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.వర్కఫ్రంహోమ్‌లో భాగంగా ఎక్కువ సేపు అలాగే కుర్చీలో కూర్చోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

రానురాను ఇది అంటు వ్యాధిగా మారుతోందని, అందుకే ఉద్యోగుల కోసం ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను తీసుకువచ్చినట్లు కామత్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Telugu Bonus, Bumber Offers, Key, Latest, Nitinkamath, Reward, Zeroda-Latest New

ఉద్యోగులు రోజువారి లక్ష్యాన్ని 90% పూర్తి చేయాలనీ, వచ్చే సంవత్సరం నాటికి ఎవరు లక్ష్యాలను చేరుకుంటారో వారికి రివార్డులు లభిస్తాయని అన్నారు.వారికి నెల జీతం బోనస్‌గా ఇవ్వడమే కాకుండా ఒక లక్కీ డ్రాను నిర్వహించి అందులో విజేతగా నిలిచిన వారికి రూ.10 లక్షల రివార్డును కూడా అందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.కాగా ఈ విషయాన్ని నితిన్‌ కామత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ఈ నేపథ్యంలో అతను ఆరోగ్యంగా ఉండేందుకు పాటిస్తున్న దినచర్యలు వెల్లడించారు.ఈ విషయం చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఈ CEOని ఆకాశానికెత్తేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube