స్నేహితుల మధ్య అప్పుడప్పుడు చిన్నాచితకా గొడవలు సహజం.అవి సరదాగా వుండాలి కానీ మరీ ప్రాణాలు తీసే స్థాయిలో వుండకూడదు.
కానీ ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ప్రాణ మిత్రుల ఉసురు తీసేస్తూ కటకటాల పాలవుతున్నారు.దేశం కానీ దేశంలోనూ కొందరు ఇదే తీరుతో ఇబ్బందుల పాలవుతున్నారు.
తాజాగా ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన యువకుడొకరు ఫ్రెండ్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే… యోయిల్ లెహింగహల్ అనే యువకుడు ఈశాన్య భారతదేశంలోని బినెయ్ మినాషే అనే యూదు తెగకు చెందినవాడు.
ఇతను ఏడాది క్రితమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి , అక్కడి నాఫ్ హెజిల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో గత గురువారం భారత్ నుంచి ఇజ్రాయెల్ వచ్చిన మరో స్నేహితుడి ఇంటిలో జరిగిన బర్త్ డే పార్టీకి వెళ్లాడు.
అక్కడ స్నేహితుల మధ్య ఏదో వ్యవహారంపై వివాదం తెలెత్తింది.అది మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.ఈ ఘటనలో కొందరు లెహింగహల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఘటన జరిగిన రోజు రాత్రి మోయిల్ తన ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.అయితే తర్వాతి రోజు బర్త్ డే పార్టీ, అక్కడ జరిగిన గొడవ గురించి వారికి తెలిసింది.ఘర్షణలో అతను తీవ్రంగా గాయపడ్డాడని.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
వీరంతా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వున్న టీనేజర్లుగా తెలుస్తోంది.వీరి మధ్య గొడవకు దారి తీసిన విషయం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇకపోతే.
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో బినెయ్ మినాషే యూదు కమ్యూనిటీ జీవనం సాగిస్తోంది.వీరు గడిచిన రెండు దశాబ్ధాలుగా భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్తున్నారు.







