పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య గొడవ.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ సన్నిహితంగా మెలుగుతున్నారు.అయితే హీరోల అభిమానులు మాత్రం చిన్నచిన్న విషయాలకు సైతం గొడవ పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Fans War Between Young Tiger Junior Ntr And Pawan Kalyan Fans Details Here , Fa-TeluguStop.com

కృష్ణా జిల్లాకు చెందిన పవన్ తారక్ అభిమానులు తాజాగా గొడవ పడగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అభిమానుల మధ్య జరిగిన ఈ గొడవలో కొంతమందికి గాయాలయ్యాయని బోగట్టా.

కొన్నిరోజుల క్రితం వాకు అభిమానుల మధ్య సోషల్ మీడియాలలో ఒకటైన ట్విట్టర్ లో వార్ జరిగేది.అయితే ఇప్పుడు మాత్రం అభిమానులు దాడులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

అగిరిపల్లి అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్టిన పవన్ బ్యానర్ ను ఎన్టీఆర్ అభిమానులు చించేయడంతో ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది.

ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ గ్రామంలో పవన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు కొత్త కాదని సమాచారం.60 నుంచి 70 మంది గొడవ పడ్డారని ఈ గొడవలో కొంతమంది అభిమానులకు గాయాలయ్యాయని సమాచారం.హీరోలు ఎన్నిసార్లు సూచించినా కొంతమంది అభిమానులు మాత్రం ఈ విషయంలో మారడం లేదని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత ఓపెనింగ్ ఈవెంట్ కు పవన్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.

నిజ జీవితంలో పవన్, తారక్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు.సరైన కథ దొరికితే పవన్ తారక్ కలిసి నటించడానికి కూడా సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే.హీరోలు బాగానే ఉన్నా అభిమానుల మధ్య గొడవలు జరుగుతుండటంతో కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పవన్ ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఇలాంటి గొడవలు రిపీట్ కాకుండా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube