మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన నిహారిక ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఒక మనసు సినిమాలో హీరోయిన్గా నటించిన నిహారిక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.యాంకర్ గా భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నిహారిక హీరోయిన్ గా మాత్రం సెటిల్ అవ్వలేకపోయింది.
ఆ తర్వాత ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక పెళ్లి చేసుకున్నప్పటికీ నిహారిక అల్లరి జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది నిహారిక.తన భర్తతో కలిసి ఎక్కువగా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె టర్కీ అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ నే ఉంది.ఇక టర్కీ లోని జెరోమె,కప్పకోడియా ప్రాంతాలలో అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ హల్చల్ చేస్తుంది.
పారాచూట్ లో వ్యవహరిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది నిహారిక.ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఆ ఫోటోలలో నిహారిక డెనిమ్ జాకెట్ ధరించింది నిహారికా.ఆకాశంలో విహరిస్తూ టర్కీ అందాలను తిలకిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.మెగా అభిమానులు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.అంతేకాకుండా నిహారిక షేర్ చేసిన ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే నిహారిక ఇటీవలే హాట్ ఫోటో షూట్ చేసి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.దాంతో కొందరు నిహారిక మద్దతుగా కామెంట్స్ చేయగా మరికొందరు నెగిటివ్ గా స్పందించారు.
ఆ విషయంలో నిహారిక బాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది.