టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే అయితే ఈ కుటుంబం పై ఎవరు ఇలాంటి విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు మెగా బ్రదర్ నాగబాబు.ఈ క్రమంలోనే తాజాగా గరికపాటి మెగాస్టార్ చిరంజీవి విషయంలో అసహనం వ్యక్తం చేసిన విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఇలా గరికపాటి చిరంజీవి పై అసహనం వ్యక్తం చేయడంతో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎక్కడ గరికపాటి పేరు ఉపయోగించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు.
ఈ విధంగా నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై బ్రాహ్మణ సంఘం స్పందిస్తూ తమదైన శైలిలో నాగబాబుకు కౌంటర్ వేశారు.
ఈ క్రమంలోనే ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ ఉపాధ్యాక్షులు ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ.ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతంగా చేస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తకు, సమాజంలో నటన వ్యాపారం తప్ప ఏమీ తెలియనటువంటి ఒక చిత్ర వ్యాపారిని చూసి అసూయ పడుతున్నారు అంటే ఆకాశం పై ఉమ్మి వేయడమేనని ఘాటుగా స్పందించారు.

చిడతలు కొట్టే వాళ్లు కూడా సంగీత విద్వాంసులమని ట్విట్టర్ లో కూని రాగాలు తీస్తే ఎలా అంటూ నాగబాబు పేరు ప్రస్తావించకుండా ద్రోణం రాజు రవికుమార్ ఘాటుగా నాగబాబుకు కౌంటర్ వేశారు.మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.ఈ విధంగా గరికపాటి మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయని చెప్పాలి.మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.







