ఒక చారిత్రక సన్నివేశం ఆవిష్కృతమైంది.నయా భారత్ కు సీఎం కేసీఆర్ నాంది పలికారు.
తెలంగాణ చరిత్రలోనే కాదు….భావి భారత చరిత్రలో నిలిచిపోయేలా ఒక నూతన శకారంభానికి కేసీఆర్ తెరదీశారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా నామకరణం చేస్తూ సగర్వంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించడం హర్షణీయమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ శుభ తరుణాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు… భారతదేశం యావత్తు స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు.దసరా రోజునే సీఎం కేసీఆర్ నూతన శకానికి నాంది పలకడం మరింత శుభసూచకం అన్నారు.
రాబోవు రోజుల్లో దేశంలోనే కీలక నేతగా కేసీఆర్ అవతరించడం తథ్యమన్నారు.సీఎం కేసీఆర్ భవిష్యత్తులో పీఎం కేసీఆర్ గా చరిత్రకు ఎక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పొంగులేటి అభిప్రాయపడ్డారు.







