అగ్ర రాజ్యం అమెరికాలో తెలంగాణా ప్రాంత వాసులు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ( TPAD) ఆధ్వర్యంలో ప్రిస్కోలోని డా.పెప్పర్ ఎరీనా లో తెలంగాణా వాసులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు.
కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలకు అమెరికాలోని పలు ప్రాంతాలలో ఉన్న తెలంగాణా రాష్ట్ర ప్రజలు, పొరుగు రాష్ట్రాలైన ఒక్లహామా, కాన్సాస్, ఆర్కాన్సా ల నుంచీ తెలుగు ప్రవాసులు వేడుకలకు హాజరయ్యారు.సుమారు 15 వేలమంది తెలుగు ప్రజలతో వేడుకలను నిర్వహిస్తున్న ఆడిటోరియం కిక్కిరిసి పోయింది.
ఎటు చూసినా సరే తెలుగు సంప్రదాయ పద్దతిలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.శనివారం మధ్యాహ్నం మొదలైన కార్యక్రమాలు తెలుగు సాంప్రదాయ నృత్యాలతో మొదలయ్యాయి.
పలు రకాల సాంస్కృతిక నృత్యాలు, తెలంగాణా సంప్రదాయ నృత్యాలు, ఆట పాటలతో ఎంతో మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ వేడుకలను సినీ ప్రముఖులు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల తరువాత బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి.అనంతరం విజయదసమి వేడుకలు, శమీ పూజలను నిర్వహించారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీమ్ పాడిన పాటలు అలరించాయి.బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నంత సేపు ఆడిటోరియం లో ఉన్న 15 వేల మంది చప్పట్లు కొట్టడంతో ఆడిటోరియం దద్దరిల్లి పోయింది.
సుమారు 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా కేరింతలు కొడుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు.సినీ నటి రీతూ వర్మ సభా ప్రాంగణంలో సందడి చేశారు.
అలయ్ బలయ్ తీసుకుని పండుగ చేసుకున్నారు.సామప్రదాయమైన వంటలు వండి అందరూ కలిసి భోజనాలు చేశారు.
తెలంగాణా సంస్కృతిని ప్రతిభింబించేలా అలంకరణలు చేశారు.ఈ వేడుకలకు హాజరయిన వారికి TPAD నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.







