ఎన్ని ప్రొమోషన్స్ చేసిన ఓపెనింగ్స్ కష్టమేనా.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 The Ghost First Day Advance Booking Report Details, The Ghost, Nagarjuna, Nagarj-TeluguStop.com

నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడు.ఈ సినిమా విజయం సాధించడంలో నాగ్ ముఖ్య పాత్ర పోషించాడు.

ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో కొద్దిసేపు కనిపించి మెరిపించాడు.

ఇక ఇప్పుడు నాగ్ సోలో హీరోగా అదృష్టం పరీక్షించు కోవడానికి ప్రేక్షకుల నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ”ది గోస్ట్” సినిమా ఒకటి.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చెయ్యగా.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ్ రా ఏజెంట్ గా కనిపించ నున్నాడు.

సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ నటించారు.నాగ్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ పెరిగింది.అయితే ఎంత బజ్ క్రియేట్ అయినా ఓపెనింగ్స్ మాత్రం కష్టమే అనే టాక్ అయితే వస్తుంది.ఈయనను ఇప్పటికి ఫ్యామిలీ హీరోగానే ప్రేక్షకులు చూస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటరైన్మెంట్స్ అయితే మహిళా ప్రేక్షకులతో పాటు కుటుంబంతో కలిసి వచ్చి ఈయన సినిమాలు చూస్తారు.అయితే ఈ సినిమా యాక్షన్ సినిమా కావడంతో నాగార్జునకు మైనస్ అయ్యింది అంటున్నారు.ది ఘోస్ట్ సినిమా విషయంలో ఫ్యామిలీస్ ఎగబడేంత సీన్ లేదు దీంతో ప్రీ బుకింగ్స్ లేకపోవడం షాక్ కు గురి చేస్తుంది.

ఫెస్టివల్ సీజన్ లో ఎలాంటి సినిమా అయినా ప్రీ బుకింగ్స్ ఉంటాయి.అయితే ఈ సినిమాకు ప్రధాన నగరాల్లో కూడా ప్రీ బుకింగ్స్ జరగలేదు.దీంతో ఓపెనింగ్స్ కష్టమే అంటున్నారు.దసరా కానుకగా 5న రాబోతున్న ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube