నేడు ATM కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది.ప్రతిసారి బ్యాంకుకి వెళ్లి డబ్బులు తీసుకోవాలంటే అది సమయంతో కూడుకున్న పని.
దీంతో ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు ATMకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్నారు.ఇలా రోజూ కొన్ని లక్షలమంది అమౌంట్ ని డ్రా చేస్తున్నారు.
అయితే ఇలా అమౌంట్ ని తరచుగా తీసుకునే వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.అదేమిటంటే తాజాగా ATM చార్జీలు పెంచారు.
దీనితో ఉచిత లిమిట్ దాటిన తరువాత ప్రతి ఒక్క లావాదేవీ పై 21 రూపాయలు ఛార్జీ పడుతుంది.
దాంతో మీరు ఎన్నిసార్లు డబ్బులు తీస్తే అన్ని 21 రూపాయలు చెల్లించాల్సిందే అన్నమాట.
ఎందుకంటే RBI ATM చార్జీలు సవరించుకోవచ్చు అని బ్యాంకులకు అనుమతినిచ్చింది.దాంతో RBI సూచన మేరకు బ్యాంకులు వాటి ATM చార్జీలను సవరిస్తున్నాయి.
ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, ICCI బ్యాంక్ తో పాటుగా పలు బ్యాంకులు వాటి ATM చార్జీలను సవరించాయి.ఇకపోతే, మామూలుగా బ్యాంకు కస్టమర్లు నెలలో ATM నుంచి 5 సార్లు ఇటువంటి చార్జీలు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

చార్జీల మోత నుండి తప్పించుకోవాలి అనుకున్న వారు చిన్న చిన్న అమౌంట్ కోసం ATMలకు వెళ్లకుండా పెద్ద మొత్తంలో కావాల్సినప్పుడు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం ఉత్తమం.అలాకాకుండా నెలకు 5 సార్లు కంటే ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేస్తే మాత్రం చార్జిల మోత ఇక తప్పదు.ఇప్పటికే బ్యాంకు కస్టమర్లకు ఆయా బ్యాంకు నుంచి సవరించిన చార్జీల అంశానికి సంబంధించి మెసేజ్లు కూడా వస్తున్నాయి.కాబట్టి ఇకపై అమౌంట్ ని విత్ డ్రా చేయాలి అనుకున్న వారు ఆలోచించి డ్రా చేయడం మంచిది.
లేదంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పై 21 రూపాయిలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.







