EMIలు కట్టేవారికి ఇక బాదుడే బాదుడు... ఎంత భారం పడుతుందో తెలుసా?

మనదగ్గర చాలామంది చిన్న, పెద్ద ఉద్యోగులు అవసరానికి లోన్ తీసుకొని ప్రతి నెలా EMIలు చెల్లిస్తూ వుంటారు.తాజాగా రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లు మరోసారి పెంచడంతో వినియోగదారులకు ఇక పెనుభారంగా మారనుంది.

 Rbi Increased The Repo Rate To 5 9 Percent-TeluguStop.com

ఇలా ప్రతి సారి RBI రెపో రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బతకాలి అనే అనుమానం రాక మానదు.తీసుకున్న రుణానికి మనం చెల్లించే వడ్డీలు ఇకనుండి పెరగనున్నాయి.ఇదివరకు ఉన్న రెపో రేటు 5.40 శాతం నుంచి 5.90 శాతానికి పెరగనుంది.గతేడాదే RBI రెపో రేటు పెంచినా మళ్లీ ఇప్పుడు పెంచడంతో వినియోగదారులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

RBI ఇలా రెపో రేటు పెంచడం ఇది నాలుగోసారి.దీంతో గృహ, వాహన రుణాలుపై తీసుకున్న రుణాల వడ్డీలు పెనుభారంగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు.నెలనెల చెల్లించే EMI చెల్లించడానికి ఇక వ్యయం పెరగనుంది.ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాలు చెల్లించడంలో మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తం వడ్డీ పెరుగుతుంది.అసలు, మొత్తం చెల్లించడానికి ఇంకా సమయం పెరిగే అవకాశం ఉంది.

రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మరింత ఇబ్బందులు రానున్నాయని పలువురు చెబుతున్నారు.కాగా RBI పెంచిన రెపోరేట్లు రేపో మాపో అందుబాటులోకి రానున్నాయి.

Telugu Loan Emis, Rbi, Rbi Repo, Rbi Repo Rates-Latest News - Telugu

ఇకపోతే ఇప్పటికే ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్న ప్రజలకు ఈ వార్త మింగుడుపడని విషయమే.ఎందుకంటే రుణాలకు సంబంధించిన వడ్డీ భారం ఎక్కువ అవుతుంది.ఫలితంగా కట్టే వాయిదాలు పెరుగుతాయి.కాగా ప్రస్తుతం వడ్డీ రేటు ఎంత పెంచనున్నారో కూడా తెలియడం లేదు.రెపో రేటు పెరిగినా, తగ్గినా ఫిక్స్ డ్ రేట్ లోన్లపై మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.మిగతా రుణాలకు సంబంధించిన ఈఎంఐలపై మాత్రం భారం కచ్చితంగా పడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube