తెలుగు ప్రేక్షకులకు అందాల భామ కేతిక శర్మ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు.కానీ గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు.
ఎందుకంటే ఈ అమ్మడు ఆ సినిమాలో తన హావభావాలను ఆ రేంజ్ లో కనబరిచింది.తన అందంతో ప్రేక్షకులను ఆ విధంగా ఫిదా చేసింది.ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించుకునేలా ఆ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.నిజంగా ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్ర కారు ఒక రేంజ్ లో పిచ్చెక్కి పోయారు.
తొలి చూపులోనె తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టకు ముందు 2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది ఈ అమ్మడు.
యూట్యూబ్లో పలు వీడియోలు చేస్తూ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.ఇక అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ప్రమోషన్ లో ఈ అమ్మడు నటించింది.
ఇక రొమాంటిక్ సినిమా స్టోరీ పరంగా ప్రేక్షకులను ఇప్పించడంతో ఈ అమ్మడు వరుస ఆఫర్లను తన చేతిలో పెట్టుకుంది.ఇక తాను ఎంచుకున్న రెండవ సినిమా లక్ష పూర్తిగా డిజాస్టర్ అయింది.

అలా ఇటీవల వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.నిజానికి ఈ సినిమా ప్లాప్ అవ్వగా ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం కొంతవరకు మార్కులు వచ్చాయి.ఇక ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియా వేదికను ఎంచుకుంది.
ఇక బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తుంది.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది.
నిజానికి కేతిక శర్మ గ్లామర్ లుక్ లో కంటే ట్రెడిషనల్ లుక్ లో బాగా అందంగా కనిపిస్తుంది.ఈ బ్యూటీ కి గ్లామర్ అంతగా సెట్ కాదు.

అయిన అవకాశాల కోసం గ్లామర్ ను పరిచయం చేస్తుంది.ఇక ఈ బ్యూటీకి తన ఫాన్స్ బాగా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు.అలా తాజాగా ఒక ఫాలోవర్ తనకు ఒక సలహా ఇచ్చారు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.తాజాగా కేతిక శర్మ తన సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫోటో షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
దీంతో ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ కొందరు లైక్స్ కొట్టగా మరికొందరు ఇలాంటి ఫోటోలు పెట్టొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఒక నెటిజన్ కూడా మరీ బోల్డ్ ఫోటో పెట్టకు నాలాంటి ఫ్యాన్స్ హట్ అవుతారు అని కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.







