ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ నిలిచారు.అధ్యక్ష ఎన్నిక కోసం దాఖలైన నామినేషన్ లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ పరిశీలించింది.
ఈ మేరకు పోటీలో ఉన్న వారి వివరాలను వెల్లడించింది.జార్ఖండ్ మాజీ మంత్రి కే ఎన్ త్రిపాఠి నామినేషన్ ను తిరస్కరించింది.
దీంతో ఖర్గే, శశిధర్ ఇద్దరే అధ్యక్ష పోటీలో ఉంటారని మధుసూదన్ మిస్త్రి తెలిపారు.కాగా ఈ నామినేషన్ లో ఉపసంహరణకు గడువు ఈనెల 8 వరకు ఉందన్నారు.
ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్నారు.ఓటింగ్ ప్రక్రియ పై ఈనెల 8న స్పష్టత వస్తుందని మధుసూదన్ వెల్లడించారు.







