ఇపుడు సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని యువత దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఎందుకంటే ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఇమిడిపోయి వుంది.
దాంతో సోషల్ మీడియాకు విశేష ఆదరణ లభిస్తోంది.ఇకపోతే ఈ సోషల్ మీడియాలో అనునిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా, ఇంకొన్ని కాస్త జుగుప్సను కలిగిస్తాయి.ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు బాగా నవ్వు వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా పెంపుడు జంతువులు గురించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి.పెంపుడు జంతువులు అయినటువంటి కుక్కలు, పిల్లులు అనేవి అచ్చం కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి అవి చేసే అల్లరి, హంగామా అంతా ఇంతా కాదు.
కలిసి తినడం, కలిసి నిద్రపోవడం, చిన్న చిన్న పనులు చేయడం వంటి చర్యలతో అందరినీ ఆకట్టుకుంటాయి.ఇక్కడ వున్న వీడియోని ఒకసారి చూస్తే, పిల్లి తన ఆహారాన్ని చూసి చాలా సంతోషించి ఆనందంతో గంతులేయడం ప్రారంభిస్తుంది.

పిల్లికి ఫుడ్ పెడుతున్న సమయంలో యజమాని ఓ సౌండ్ చేసి ఆహారం తెచ్చానని దానికి తెలియజేస్తాడు.అది విన్న పిల్లి వెంటనే వేగంగా పరిగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు.సంతోషం పట్టలేక ఆనందంతో చెంగు చెంగున ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంది.చివరలో బేబీ క్యాట్ బౌల్ లో ఉన్న ఫుడ్ ను తినే విధానం చూస్తే నవ్వు ఆగడం లేదు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మియావ్డ్ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు.ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి.అంతే కాకుండా పిల్లి ఎక్స్ ప్రెషన్స్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.మనుషులైనా, జంతువులైనా వారి చర్యలు ఒకేలా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.







