తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు.24 గంటలు విద్యుత్ ఉన్న ఒక్క ట్రాన్స్ఫార్మర్ ను చూపిస్తే కెసిఆర్ కు పాలాభిషేకం చేస్తానని చెప్పారు.అదేవిధంగా ప్రజలను మభ్య పెట్టేందుకే అవార్డుల ప్రకటిస్తున్నారని విమర్శించారు.
అవార్డుల ప్రకటనతో బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య బంధం బయటపడింది అన్నారు.కెసిఆర్ పెట్టే జాతీయ పార్టీ మనుగడ సాధించలేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.15 సీట్లకు మించి పోటీ చేయదని జోష్యం చెప్పారు.







