వరుసగా పుణ్యక్షేత్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దసరా రోజున ఆయన జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో వరసగా పుణ్యక్షేత్రాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళనున్నారు.

ఎల్లుండి వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.అక్టోబర్ 3న కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని సమాచారం.

ఎన్నికలకు ముందు కోనాయపల్లి ఆలయంలో పూజలు చేయించడం కేసిఆర్ కు ఆనవాయితీగా వస్తుంది.మరోవైపు అక్టోబర్ 5న తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు టిఆర్ఎస్ఎల్పి భేటీ జరగనుంది.

Advertisement

దీనిలో జాతీయ పార్టీపై శాసనసభాపక్షం ఏకగ్రీవ తీర్మానం చేయనుంది.అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా తీర్మానం జరగనుంది.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.అంతేకాకుండా ఇదే భేటీలో జాతీయ పార్టీ కోఆర్డినేటర్ల నియామకాలు వెల్లడించే అవకాశం ఉంది.

అనంతరం అక్టోబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు