సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి గారి మరణం సినిమా పరిశ్రమకు పెద్ద షాకింగ్ విషయం.ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీ మహేష్ బాబు మరియు కృష్ణ లను పరామర్శించేందుకు తరలి వెళ్లారు.
కానీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్నాడు.మధ్యాహ్నం వరకు ఆ సినిమా షూటింగ్లో పాల్గొని ఆ తర్వాత అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
మహేష్ బాబు, కృష్ణ గార్లను పరామర్శించేందుకు చిరంజీవి హైదరాబాద్ రాలేక పోయారు.
నిన్న రాత్రి అనంతపురంలో గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి అయిన వెంటనే వైజాగ్ వెళ్లి వాల్తేరు వీరన్న షూటింగ్లో మళ్లీ జాయిన్ అవ్వాల్సి ఉంది కానీ, షూటింగ్ వాయిదా వేసుకుని మరి ప్రత్యేక విమానంలో మహేష్ బాబును మరియు కృష్ణ లను పరామర్శించేందుకు చిరంజీవి హైదరాబాద్ వచ్చారు.
మళ్లీ వెంటనే సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళనున్నట్లుగా సమాచారం అందుతుంది.మహేష్ బాబు మరియు కృష్ణ గార్లతో చిరంజీవికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే షూటింగ్ ఆపేసి మరీ ప్రత్యేక విమానంలో చిరంజీవి హైదరాబాదు వచ్చాడంటూ మెగా సన్నిహితులు అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అనడంలో సందేహం లేదు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాని విడుదల చేయబోతున్నారు.మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా 200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
దాంతో తప్పకుండా భారీ కలెక్షన్స్ ని ఆ సినిమా రాబడుతుందని నమ్మకంతో మెగా అభిమానులు ఉన్నారు.