చివరి రోజుల్లో ఇందిరా దేవి ఇంత నరకం అనుభవించిందా.. దాదాపు 30 రోజులపాటు?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒకరి మరణం గురించి మర్చిపోకముందే మరొకరి మరణ వార్త వినడంతో ఇండస్ట్రీలో కలకల రేపుతుంది.

 Did Indira Devi Experience Such Hell In Her Last Days For Almost 30 Days ,indir-TeluguStop.com

ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు తమ తమ సమస్యలతో మృతి చెందారు.ఇటీవలే అనారోగ్య పరిస్థితి వల్ల రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ఇక ఈయన మరణాన్ని సినీ ఇండస్ట్రీ అస్సలు తట్టుకోలేకపోయింది.ఇప్పటికీ ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్న తెలుగు ప్రజలకు మరో వార్త చెవిన పడింది.అదేంటో కాదు మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిర దేవి ఈ లోకాన్ని విడిచిపెట్టారు.గత కొంతకాలం ఈమె అనారోగ్య సమస్యతో బాధపడినట్లు తెలుస్తుంది.

Telugu Ghattamaneni, Indira Devi, Mahesh Babu, Manjula, Ramesh Babu, Krishna, Vi

అయితే ఈమె మరణానికి ముందు ఏం జరిగిందంటే.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇందిరా దేవికి ఆరోగ్యం మరింత విషమించడంతో తనను హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.ఇక ఆమెకు ప్రతిరోజు అక్కడ చికిత్స చేయించగా దాదాపు 30 రోజులపాటు హాస్పిటల్లో ఉన్నట్లు తెలిసింది.

దీంతో ఆమెను నాలుగు రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగా.

అప్పటికే ఆమె పరిస్థితి కష్టంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులతో తెలిపారట.ఇక దాంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా నాలుగు రోజులుగా ఆమెకు పూర్తి సమయాన్ని కేటాయించారట.

పైగా ఆమెకు ధైర్యం కల్పించే విధంగా తోడుగా ఉన్నారట.

Telugu Ghattamaneni, Indira Devi, Mahesh Babu, Manjula, Ramesh Babu, Krishna, Vi

అయిన కూడా ఆమె అనారోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో.ఈరోజు అనగా బుధవారం ఉదయం ఆమె క‌న్నుమూశారు.దీంతో విటమినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలుపుతున్నారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇక కొందరు రాజకీయ నాయకులు కూడా పరామర్శించగా.

మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.ఇక ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.అందులో మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల.

ఈ ముగ్గురు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం ఉన్నవాళ్లే.

Telugu Ghattamaneni, Indira Devi, Mahesh Babu, Manjula, Ramesh Babu, Krishna, Vi

ఇక కొంతకాలం తర్వాత కృష్ణ నటి విజయనిర్మలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకోగా ఆమె కూడా లోకాన్ని వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే.మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా ఆ మధ్యనే మరణించారు.దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు వరుస విషాదాలతో మునిగిపోయారని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం యూట్యూబ్ లలో ఇందిరా దేవికి సంబంధించిన వార్తలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube