నేటికాలంలో జాబ్ దొరకడం అనేది గగనంలాగా మారింది.తగినంత అర్హత, స్కిల్స్ ఉన్నప్పటికీ కొంతమందికి ఉద్యోగాలు రావడంలేదు.
ఈ క్రమంలో కొంతమంది వినూత్నంగా జాబ్ ట్రైల్స్ వేసి, జాబ్స్ కొడుతున్నారు.ఇకపోతే జాబ్ సెర్చింగ్‌లో రెజ్యూమ్ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అభ్యర్థికి సంబంధించిన అత్యుత్తమ సామర్థ్యాలు, లక్షణాలను వివరించేది ఇదే.మనం ఒక ఉద్యోగానికి వెళ్లాలంటే ప్రధమంగా ఉండాల్సింది ఇదే.అయితే ఇటీవలి కాలంలో ఉద్యోగార్థులు తమ రెజ్యూమ్ ప్రిపరేషన్‌కు క్రియేటివిటీని జోడిస్తూ రిక్రూటర్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఒక మహిళ చూపించిన క్రియేటివ్ స్కిల్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.
తన రెజ్యూమ్‌ను ఏకంగా కేక్‌పై ముద్రించి నేరుగా ఎంప్లాయర్‌కు పంపింది.వివరాల్లోకి వెళితే, నైక్ సంస్థలో ఉద్యోగం పొందాలని ఆశపడిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్.
అప్లికేషన్‌ను అధికారికంగా ఇమెయిల్‌కు పంపే బదులు ప్రత్యేకమైన రెజ్యూమ్‌ను పంపాలని నిర్ణయించుకుంది.ఇందుకు సంబంధించిన స్టోరీని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసింది.
దాంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సదరు సంస్థలో అయితే ఓపెనింగ్స్ లేవట.కానీ ఆ కంపెనీకి ఆమె ఎవరో తెలపడానికి కొత్త మార్గాన్ని అనుసరించాలని అనుకుందట.అంతేకాదు, భవిష్యతులో ఓపెనింగ్స్ పడితే వారు తనని గుర్తుపెట్టుకుంటారనే నమ్మకంతోనే ఇలా చేసానని అమ్మడు చెప్పుకొచ్చింది.
చివరికి డెనిస్ బాల్డ్విన్ అనే మహిళ ద్వారా తన కేక్ రెజ్యూమ్‌ను సంబంధిత టీమ్ సభ్యులకు అందేలా డెలివరీ చేయగలిగింది.ఇక సదరు మహిళకు ఉద్యోగం రానప్పటికీ.
ఆమె సృజనాత్మకత, సంకల్పం మాత్రం ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆకట్టుకోవడమే కాక ప్రేరణ కలిగిస్తోంది.







