“Marriages on EMI” అమెరికాలో కొత్త ట్రెండ్...!!!

వెయ్యి అబద్దాలు ఆడయినా సరే ఓ పెళ్లి చేయాలి అంటారు.అలాగే పెళ్ళిళ్ళు చేయాలంటే నూటికి 90 శాతం మంది అప్పు చేయాల్సిందే.

మన ఇంట్లోనో, చుట్టాల ఇళ్ళలోనో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు గమనిస్తే తెలుస్తుంది అప్పులేని పెళ్లి ఎక్కడా ఉండదని.తెలిసిన వాళ్ళ నుంచీ అప్పు తీసుకునో, లేదంటే పొలం తాకట్టు పెట్టి బ్యాంక్ ల నుంచీ అప్పు తీసుకోవడమో ఇలా రక రకాల మార్గాల ద్వారా పెళ్ళిళ్ళు చేయడానికి తల్లి తండ్రులు అప్పులు చేస్తుంటారు, తరువాత వారి తిప్పలు మామూలేలెండి.

ఇదిలాఉంటే తాజాగా ఈ పెళ్ళిళ్ళ విషయంపైనే సుదీర్ఘంగా ఆలోచన చేసిన అమెరికాలోని పలు కార్పోరేట్ సంస్థలు.పెళ్ళిళ్ళు చేయడానికి తల్లి తండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, అప్పులు దొరకక తెగ ఇబ్బంది పడుతున్నారు.

వారి భాదలను తీర్చేస్తే పోలా అనుకున్నాయో ఏమో Marriages on EMI అంటూ కొత్త వ్యాపారానికి పునాది వేసారు.మీ పిల్లల పెళ్ళికి డబ్బు అందించే భాద్యత మాది అంటూ పిల్లల తల్లి తండ్రులకు భరోసానిస్తున్నారు.

Advertisement

తల్లి తండ్రుల ఆర్ధిక మూలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వారి ఆస్తుల వివరాలు, వారు చేస్తున్న వ్రుత్తి ఇలా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పెళ్ళిళ్ళ కోసం వాయిదాల పద్దతిలో అప్పులు ఇస్తున్నాయి.ఇప్పుడు అమెరికాలో నయా ట్రెండ్ అయ్యింది.

పిల్లల తల్లి తండ్రులు సైతం ఖర్చు భారీగా చేయడానికి వెనుకాడటం లేదట దాంతో సదరు కంపెనీలకు కాసుల పంటలు కురుస్తున్నాయి.

అమెరికాలో తాజాగా జరిగిన ఓ సర్వేలో సుమారు 15 వేల పేరెంట్స్ ను ప్రశ్నించగా సగానికి పైగా తల్లి తండ్రులు ఈ కొత్త విధానానికి ఓటు వేస్తున్నారట.అంతేకాదు ఒక్కో కుటుంబం రూ.22 లక్షలు పెళ్ళిళ్ళ కోసం ఖర్చు చేయడానికి వెనుకాడం లేదట.అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉంటున్నారా సంతోషంగా ఉన్నారా, పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశాము అనుకునే వారే ఎక్కువగా ఉన్నారట.

అయితే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు చెయాడం సరైన నిర్ణయం కాదని, అప్పుల్లో కూరుకుపోవడం కంటే పెళ్ళిళ్ళ ఖర్చులు తగ్గించుకోవడం ఎంతో మంచిదని కొందరు పేరెంట్స్ కామెంట్స్ చేస్తున్నారట.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు