Interesting Story: చేస్తున్న ఉద్యోగాన్ని కాలితో తన్ని, 23 ఏళ్లుగా సముద్రంలోనే జీవిస్తున్న ఓ వ్యక్తి!

మీలో ఎంతమందికి వుద్యోగం చేయడం అంటే ఇష్టం? దాదాపు ఇష్టముండదు కదూ.ఎందుకంటే ఇక్కడ వుద్యోగం చేస్తున్న 99% మంది జీవితానికి రాజీపడి ఏదోఒక పనిని చేస్తూ బతుకుతూ వుంటారు.

 Interesting Story Floridas Maria Salcedo Left Job Spends 23 Years On Sea-TeluguStop.com

పొద్దున్నే లేచి, హడావిడిగా రెడీ కావాలి.ఆఫీస్ కు వెళ్లి, ఆదరాబాదరా రోబోలా పని చేసి, తిరిగి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాస్త తిని, పడుకోవాలి.

మళ్లీ రేపు సీన్ రిపీట్.దాదాపు 365 రోజులు ఇలాగే ఉంటుంది కదూ.కానీ తప్పదు.కుటుంబ బాధ్యతలు.

కానీ మీలో కొంతమంది మాత్రం తమకి ఇష్టమైన రంగాలలో సమయంతో, డబ్బుతో పనిలేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతూ వుంటారు.

ఇపుడు అలాంటివ్యక్తుల్లో ఒక విభిన్న వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం.

ఇతనుకు కూడా ఒకప్పుడు అలాంటి నిస్సారం లేని జీవితాన్ని గడిపేవాడు.కానీ నేడు జ్ఞానోదయమై జీవితాన్ని ఆసాంతం ఆస్వాదిస్తున్నాడు.

ఫ్లోరిడాలోని మయామికి చెందిన “మారియో సాల్సెడో” తాజాగా తాను వర్క్ చేస్తున్న ఆఫీసుకి రిజైన్ లెటర్ విసిరి కొట్టాడు.లైఫ్ డెస్టినేషన్ వైపు బయల్దేరాడు! సుమారు పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు.

పలు ఫైనాన్స్ సంస్థల్లో పనిచేశాడు.ఫెడరల్ ఎక్స్​ప్రెస్ అనే సంస్థలో చాలా కాలం వర్క్ చేశాడు.

నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాడు.కొంత కాలం తర్వాత “ఏంట్రా ఈ జీవితం?” అనే ఆలోచన మొదలైంది.

Telugu Florida, Story, Latest, Job, Maria Salcedo, Miami, Spends Sea-Latest News

చివరకు 43 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని లెఫ్ట్ లెగ్ తో తన్ని, తమకు ఇష్టమైన సముద్రయానం వైపు మళ్లాడు.ఓసందర్భంలో మనోడు సముద్రంపై విహరించాడట.దాంతో అతనికి ఎక్కడా లేనంత కిక్కు ఇచ్చింది.ఇది కదా జీవితం అనుకున్నాడు.కట్ చేస్తే.23 ఏళ్లుగా సముద్రంలోనే ఉంటున్నాడు! ఈ గ్యాప్​లో.కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే అతను భూమ్మీద ఉన్నాడు! అదికూడా.కరోనా కారణంగా షిప్పులు తిరగడం కూడా ఆగిపోయిన నేపథ్యంలో.ఇపుడు అతను జీవిత పాఠాలు వల్లిస్తున్నాడు.జీవితాన్ని ఆస్వాదించామని చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube