Interesting Story: చేస్తున్న ఉద్యోగాన్ని కాలితో తన్ని, 23 ఏళ్లుగా సముద్రంలోనే జీవిస్తున్న ఓ వ్యక్తి!
TeluguStop.com
మీలో ఎంతమందికి వుద్యోగం చేయడం అంటే ఇష్టం? దాదాపు ఇష్టముండదు కదూ.ఎందుకంటే ఇక్కడ వుద్యోగం చేస్తున్న 99% మంది జీవితానికి రాజీపడి ఏదోఒక పనిని చేస్తూ బతుకుతూ వుంటారు.
పొద్దున్నే లేచి, హడావిడిగా రెడీ కావాలి.ఆఫీస్ కు వెళ్లి, ఆదరాబాదరా రోబోలా పని చేసి, తిరిగి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాస్త తిని, పడుకోవాలి.
మళ్లీ రేపు సీన్ రిపీట్.దాదాపు 365 రోజులు ఇలాగే ఉంటుంది కదూ.
కానీ తప్పదు.కుటుంబ బాధ్యతలు.
కానీ మీలో కొంతమంది మాత్రం తమకి ఇష్టమైన రంగాలలో సమయంతో, డబ్బుతో పనిలేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతూ వుంటారు.
ఇపుడు అలాంటివ్యక్తుల్లో ఒక విభిన్న వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం.ఇతనుకు కూడా ఒకప్పుడు అలాంటి నిస్సారం లేని జీవితాన్ని గడిపేవాడు.
కానీ నేడు జ్ఞానోదయమై జీవితాన్ని ఆసాంతం ఆస్వాదిస్తున్నాడు.ఫ్లోరిడాలోని మయామికి చెందిన "మారియో సాల్సెడో" తాజాగా తాను వర్క్ చేస్తున్న ఆఫీసుకి రిజైన్ లెటర్ విసిరి కొట్టాడు.
లైఫ్ డెస్టినేషన్ వైపు బయల్దేరాడు! సుమారు పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు.పలు ఫైనాన్స్ సంస్థల్లో పనిచేశాడు.
ఫెడరల్ ఎక్స్ప్రెస్ అనే సంస్థలో చాలా కాలం వర్క్ చేశాడు.నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాడు.
కొంత కాలం తర్వాత "ఏంట్రా ఈ జీవితం?" అనే ఆలోచన మొదలైంది. """/"/
చివరకు 43 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని లెఫ్ట్ లెగ్ తో తన్ని, తమకు ఇష్టమైన సముద్రయానం వైపు మళ్లాడు.
ఓసందర్భంలో మనోడు సముద్రంపై విహరించాడట.దాంతో అతనికి ఎక్కడా లేనంత కిక్కు ఇచ్చింది.
ఇది కదా జీవితం అనుకున్నాడు.కట్ చేస్తే.
23 ఏళ్లుగా సముద్రంలోనే ఉంటున్నాడు! ఈ గ్యాప్లో.కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే అతను భూమ్మీద ఉన్నాడు! అదికూడా.
కరోనా కారణంగా షిప్పులు తిరగడం కూడా ఆగిపోయిన నేపథ్యంలో.ఇపుడు అతను జీవిత పాఠాలు వల్లిస్తున్నాడు.
జీవితాన్ని ఆస్వాదించామని చెబుతున్నాడు.
ఇంతకంటే దిగజారి పోవద్దు… డైరెక్టర్ గీతా కృష్ణకు కౌంటర్ ఇచ్చిన కోటి!